కోరుట్లలో వ్యబిచార ముఠా గుట్టు రట్టు..

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కొంత కాలంగా సెక్స్ రాకెట్ ను ఓ వ్యక్తి నిర్వహిస్తుండగా గుట్టు రట్టు చేసి నిర్వాహకున్ని కోరుట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2025-01-07 04:39 GMT

దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కొంత కాలంగా సెక్స్ రాకెట్ ను ఓ వ్యక్తి నిర్వహిస్తుండగా గుట్టు రట్టు చేసి నిర్వాహకున్ని కోరుట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో సోమవారం రాత్రి 11 గంటలకు ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని ఆదర్శ నగర్ కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు జంటలు, ఓ నిర్వాహకున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

అయితే గత కొంత కాలంగా కోరుట్ల, మెట్ పల్లి, పట్టణ శివారు కాలనీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నారన్న వాదనలు సైతం వినిపించగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు గత కొద్ది కాలంగా నిఘా పెట్టారు. అయితే తాజాగా సోమవారం సమాచారం అందుకున్న పోలీసులు విటులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన నిర్వాహకుడు ఓ పెద్దమనిషిగా సొసైటీలో పేరుగాంచిన వారిగా తెలుస్తుంది. కానీ నిర్వాహకుడిని తమదైన శైలిలో విచారణ చేస్తే భారీ స్థాయిలో సెక్స్ రాకెట్ గుట్టురట్టయే అవకాశం కూడా ఉందని తద్వారా ఆయా కాలనీలో అసాంఘిక కార్యకలాపాలకు ముగింపు పలికే అవకాశం కూడా ఉందని ఆయా కాలనీవాసులు తెలుపుతున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు విటులు, నిర్వాహకుని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కోరుట్ల ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.


Similar News