గ్రీవెన్స్ డే తో బాధితుల సమస్యలకు పరిష్కారం

జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

Update: 2025-01-06 16:18 GMT

దిశ, జగిత్యాల టౌన్ : జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 11 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

    అలాగే ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకొవాలని, పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారుని కి భరోసా,నమ్మకం కలిగించాలన్నారు. బాధితుల ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. 


Similar News