రైతులను నిండా ముంచుతున్న బ్రోకర్లు, దళారులు..
పెద్దపల్లి జిల్లాలో జీరో దందా జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాల్లో పత్తి కొనుగోళ్ల వ్యాపారం బ్రోకర్లు, దళారులు అక్రమంగా నడిపిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో జీరో దందా జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాల్లో పత్తి కొనుగోళ్ల వ్యాపారం బ్రోకర్లు, దళారులు అక్రమంగా నడిపిస్తున్నారు. లైసెన్స్ లేకుండా నిబంధనలు పాటించకుండా అక్రమ మార్గంలో పత్తిని కొనుగోలు చేస్తున్నారు. రైతులకు రసీదు కూడా ఇవ్వకుండా దళారులు, బ్రోకర్లు వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఈ తరహా వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కొందరు బ్రోకర్లు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. ఎలక్ట్రికల్ కాంటాలు కాకుండా పాత కాంటాలతో పత్తి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతుల నుంచి అందిన కాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. దీంతో ఈ వ్యాపారం జోరుగా యథేచ్ఛగా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి సైతం పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. ఫర్టిలైజర్ దారులే ఈ దందాలో ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి నుంచి రైతులు బకాయి పెట్టి పంట పొలాల పిచ్చికారికి పురుగు మందులు కొంటుంటారు. దీంతో రైతుల వద్ద డబ్బులు రావడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో జీరో దందా జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాల్లో పత్తి కొనుగోళ్ల వ్యాపారం బ్రోకర్లు, దళారులు అక్రమంగా నడిపిస్తున్నారు. లైసెన్స్ లేకుండా నిబంధనలు పాటించకుండా అక్రమ మార్గంలో పత్తిని కొనుగోలు చేస్తున్నారు. రైతులకు రసీదు కూడా ఇవ్వకుండా దళారులు, బ్రోకర్లు వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఈ తరహా వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కొందరు బ్రోకర్లు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. ఎలక్ట్రికల్ కాంటాలు కాకుండా పాత కాంటాలతో పత్తి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతుల నుంచి అందినకాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. దీంతో ఈ వ్యాపారం జోరుగా యథేచ్ఛగా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి సైతం పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. ఫర్టిలైజర్ దారులే ఈ దందాలో ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి నుంచి రైతులు బకాయి పెట్టి పంట పొలాల పిచ్చికారికి పురుగు మందులు కొంటుంటారు. దీంతో రైతుల వద్ద డబ్బులు రావడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్రమ మార్గాన సంపాదించిన డబ్బుతో దళారులు, బ్రోకర్లు భూములు, ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి చెల్లించే టాక్స్ నుంచి కూడా తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
రూ.కోట్లలో సాగుతున్న వ్యాపారం..
ఈ జీరో అక్రమ దందా వ్యాపారం జిల్లా వ్యాప్తంగా దళారులు, బ్రోకర్లు జోరుగా నడుపిస్తున్నారు. కొనుగోలు చేసిన పత్తిని సీసీఐ ప్రైవేట్ మిల్లులకు తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. రైతుల వద్ద తక్కువ రేటుకు కొనుగోలు చేసి మార్కెట్‌లో మాత్రం అధిక రేటుకు అమ్ముకుంటున్నారు. కాంటాల్లో మొగ్గు చూపుతూ కిలో కట్టింగ్ పేరుతో కోత పెడుతూ రైతులను నిండా ముంచుతున్నారు. ఇలా కొనుగోలు చేసిన పత్తిని సీసీఐ కేంద్రాలకు తరలిస్తున్నారు. పత్తిని కొనుగోలు చేయడానికి రైతుల భూమి పాస్ పుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా, సెల్ నంబర్ కావాల్సి ఉండగా వీటిని కొనుగోలు చేసిన దళారులు, బ్రోకర్లు రైతుల నుంచి సేకరిస్తున్నారు. రైతుల పట్టా పాస్ పుస్తకం ఏ రకం పంట వేశారో తెలుసుకోవడానికి వ్యాపారులు కార్యాలయంలో ఓటీపీ ద్వారా తెలుసుకుంటున్నారు. పత్తి కొనుగోలు అయిన తర్వాత మొత్తం డబ్బులు ఒక రైతు అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయిస్తున్నారు. దీంతో అందినకాడికి దోచుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు నిఘా పెట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.