డివైడర్‌ను ఢీకొట్టిన వ్యవసాయ కూలీల ఆటో

బుధవారం తెల్లవారు జామున వ్యవసాయ కూలీల(Agricultural labourers)తో వెళ్తున్న ఆటో(Auto) అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది.

Update: 2025-01-08 05:43 GMT

దిశ, వెబ్ డెస్క్: బుధవారం తెల్లవారు జామున వ్యవసాయ కూలీల(Agricultural labourers)తో వెళ్తున్న ఆటో(Auto) అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. కరీంనగర్ - హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామం స్టేజి వద్ద జరిగిన ఈ ప్రమాదం(Accident)లో 13 మంది వ్యవసాయ కూలీలకు గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి(Huzurabad Area Hospital)కి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్ తో పాటు 14 మంది ఉండగా.. ట్రాలీ లో ఉన్న 13 మంది మహిళా కూలీలకు గాయాలయ్యాయి. వారిలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. వీరంతా.. కందుగుల గ్రామం నుంచి భీంపల్లి గ్రామానికి వరి నాటు వేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News