HarishRao : బీర్ల నిలిపివేతపై అనుమానాలు : హరీష్‌రావు
తెలంగాణలో కేఎఫ్ బీర్ల(KF Beers) సరఫరా నిలిపివేస్తామని యూబీఎల్(UBL) ప్రకటించిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కేఎఫ్ బీర్ల(KF Beers) సరఫరా నిలిపివేస్తామని యూబీఎల్(UBL) ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019 నుంచి ధరలను సవరించకపోవడం, బీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడంతో తమకు భారీ నష్టాలు వస్తున్నాయని, గత్యంతరం లేక బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ పేర్కొంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావు(HarishRao) తీవ్ర ఆరోపణలు చేశారు. బీర్ల నిలిపివేతపై తమకు పలు అనుమానాలున్నాయని అన్నారు. రాష్ట్రంలో బూమ్ బూమ్(BOOM BOOM), బిర్యానీ బీర్లు(Biryani Beers) తీసుకురావడానికే ఉద్దేశపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. నిజంగానే ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేయలేదా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా బీర్ల సరఫరా నిలిపివేస్తామని యూబీఎల్ ప్రకటించడంపై ప్రభుత్వం మండిపడింది. తమని సంప్రదించకుండా ఎలా సరఫరా ఆపేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సడన్ గా ఇలా చేస్తే.. వైన్స్ యజమానులు కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ లో అధిక ధరకు మద్యాన్ని అమ్మే అవకాశం ఉందని యూబీఎల్ మీద అసహనం వ్యక్తం చేసింది.