పంతంగి ‘టోల్ ప్లాజా’ను దిగ్బంధిస్తా.. TRS ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, నల్లగొండ : జాతీయ రహదారి సమస్యలను పరిష్కరించకపోతే నేనే టోల్ ప్లాజాలను దిగ్బంధిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అనేకసార్లు ఉన్నతాధికారులను కోరినా పట్టించుకోలేదని వారిపై మండిపడ్డారు. ఇకపై పనుల్లో అలసత్వం వహిస్తే ఊరుకోబోమన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని గుండ్రంపల్లి, సుంకేనపల్లి, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిట్యాల, నకిరేకల్, ఇనుపాముల […]
దిశ ప్రతినిధి, నల్లగొండ : జాతీయ రహదారి సమస్యలను పరిష్కరించకపోతే నేనే టోల్ ప్లాజాలను దిగ్బంధిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అనేకసార్లు ఉన్నతాధికారులను కోరినా పట్టించుకోలేదని వారిపై మండిపడ్డారు.
ఇకపై పనుల్లో అలసత్వం వహిస్తే ఊరుకోబోమన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని గుండ్రంపల్లి, సుంకేనపల్లి, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిట్యాల, నకిరేకల్, ఇనుపాముల తదితర గ్రామాల వద్ద ఉన్న సమస్యలను పూర్తి చేయకపోతే తానే స్వయంగా పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాలను దిగ్బంధిస్తామని తీవ్రస్థాయిలో అధికారులపై విరుచుకుపడ్డారు.