కేసీఆర్ కోసం మోకాళ్ళపై గుడి మెట్లెక్కి మొక్కులు

దిశ, మంగపేట : కరోనా బారి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు త్వరగా కోలుకోవాలంటూ టీఆర్ఎస్ మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, యూత్ మండల నాయకుడు కన్నా సంపత్ లు మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయం మెట్లను మోకాళ్ళ మీద ఎక్కి, ప్రత్యేక పూజలు చేశారు. స్వామి సన్నిధికి చేరుకున్న వారు వేదపండితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ […]

Update: 2021-04-21 02:50 GMT

దిశ, మంగపేట : కరోనా బారి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు త్వరగా కోలుకోవాలంటూ టీఆర్ఎస్ మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, యూత్ మండల నాయకుడు కన్నా సంపత్ లు మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయం మెట్లను మోకాళ్ళ మీద ఎక్కి, ప్రత్యేక పూజలు చేశారు. స్వామి సన్నిధికి చేరుకున్న వారు వేదపండితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసిఆర్ ఆరోగ్యంతో బాగుండాలని కరోనా నుండి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News