దసరా ఉత్సవాల్లో TRS నేతల కక్కుర్తి.. ఏం చేశారో తెలుసా.?

దిశ, గోదావరిఖని : సద్దుల బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాల పేరిట అధికారులు, ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆరోపించారు. ఓ వైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ ఉత్సవాలను అడ్డం పెట్టుకొని పర్సంటేజీలకు కక్కుర్తి పడటం సరైన విధానం కాదన్నారు. సుమారు 50 లక్షల వ్యయంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అధికార పార్టీ నేతలు అధికారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఉత్సవాల నిర్వహణ సమయంలో […]

Update: 2021-10-18 05:46 GMT

దిశ, గోదావరిఖని : సద్దుల బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాల పేరిట అధికారులు, ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆరోపించారు. ఓ వైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ ఉత్సవాలను అడ్డం పెట్టుకొని పర్సంటేజీలకు కక్కుర్తి పడటం సరైన విధానం కాదన్నారు. సుమారు 50 లక్షల వ్యయంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అధికార పార్టీ నేతలు అధికారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

ఉత్సవాల నిర్వహణ సమయంలో మహిళా కార్పొరేటర్లకు కనీసం వేదికపైన కూడా ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. దసరా ఉత్సవాలు ప్రజల కోసం కాకుండా టీఆర్ఎస్ పార్టీ నేతల కార్యకర్తల సభగా మారిందని అన్నారు. అధికార పార్టీ నాయకుల స్వప్రయోజనాల కోసమే అధికారులు వేడుకలు నిర్వహించుకోవడం శోచనీయమన్నారు. ఉత్సవాల కోసం తెచ్చిన బాణాసంచా సగానికి సగం టీఆర్ఎస్ నాయకుల ఇళ్లకే చేరిపోయాయని విమర్శించారు. బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాల పేరుతో వృధా చేసిన ప్రజాధనానికి సంబంధించిన లెక్కలను కార్పొరేషన్ అధికారులు చూపించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News