‘దళితులను మోసం చేస్తున్న ప్రభుత్వం’

దిశ, మెదక్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌లోనూ దళితులను మోసం చేస్తూ వస్తోందని సంగారెడ్డి జిల్లా ‘కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం’ (కేవీపీఎస్) అధ్యక్షులు అతిమేల మాణిక్ ఆరోపించారు. మంగళవారం కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో దళితులకు కేటాయింపులు పెరుగుతున్నాయి తప్ప ఖర్చు మాత్రం చేయడం లేదని విమర్శించారు. గత ఆరేండ్లలో రూ. 61 వేల కోట్లు కాగితాల్లో […]

Update: 2020-03-10 03:33 GMT

దిశ, మెదక్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌లోనూ దళితులను మోసం చేస్తూ వస్తోందని సంగారెడ్డి జిల్లా ‘కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం’ (కేవీపీఎస్) అధ్యక్షులు అతిమేల మాణిక్ ఆరోపించారు. మంగళవారం కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో దళితులకు కేటాయింపులు పెరుగుతున్నాయి తప్ప ఖర్చు మాత్రం చేయడం లేదని విమర్శించారు. గత ఆరేండ్లలో రూ. 61 వేల కోట్లు కాగితాల్లో కేటాయించి అందులో సగం కూడా ఖర్చు చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దారుణమన్నారు. అంబేద్కర్ జయంతికి ప్రతి జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్ చెరు నియోజకవర్గ కేంద్రాల్లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ నాయకులు చంద్రశేఖర్, శ్రీకాంత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News