బిల్డింగ్ ఎక్కి…యువకుడు హల్ చల్

తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి బిల్డింగ్ పైకి ఎక్కి హల్ చల్ చేసిన సంఘటన రామాయంపేట మండల పరిధిలోని అక్కన్న పేట గ్రామంలో చోటుచేసుకుంది

Update: 2024-12-23 15:52 GMT

దిశ, నిజాంపేట: తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి బిల్డింగ్ పైకి ఎక్కి హల్ చల్ చేసిన సంఘటన రామాయంపేట మండల పరిధిలోని అక్కన్న పేట గ్రామంలో చోటుచేసుకుంది. ఈ మేరకు గ్రామానికి చెందిన భూమా నవీన్ అనే వ్యక్తి కి ఓ బిల్డింగ్ యజమాని డబ్బులు ఇవ్వవలసి ఉందని ఇవ్వకపోవడంతో అదే బిల్డింగ్ పైకి ఎక్కి డబ్బులు తనకు చెల్లించాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు యువకుడికి నచ్చజెప్పి కిందికి దించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News