కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని ముత్యంపేట్ లో చోటుచేసుకుంది.
దిశ,దౌల్తాబాద్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని ముత్యంపేట్ లో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ సాయిలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముత్యాంపేట్ గ్రామానికి చెందిన తొడంగి భాస్కర్ (27) కు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కు చెందిన విజయలక్ష్మి తో 5 సంవత్సరాల కిందట ప్రేమ వివాహం జరిగింది. వారికి ఇద్దరూ కుమారులు ఉన్నారు. గత కొద్ది కాలంగా కుటుంబ సమస్యల వల్ల తరుచూ భార్యాభర్తలకు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన భాస్కర్ ఆదివారం తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సాయిలు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.