అగ్ని వీర్ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి

త్రివిధ దళాలలో అగ్నివీర్ ఉద్యోగాలకు జిల్లాలోని నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

Update: 2024-12-23 12:18 GMT

దిశ, సంగారెడ్డి : త్రివిధ దళాలలో అగ్నివీర్ ఉద్యోగాలకు జిల్లాలోని నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. అగ్ని వీరు ఉద్యోగాలకు 2005 జనవరి 1 నుంచి 2008 జూలై 1వ తేదీ మధ్యలో జన్మించిన వారు అర్హులన్నారు. స్త్రీ/ పురుషులు అవివాహితులైన ఉండాలన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి 27వ తేదీ వరకు అగ్నివీర్ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్ లో మార్చి 22వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు, ఆన్లైన్ దరఖాస్తులకు https:/agnipathvayu.cdca.in/. వెబ్ సైట్ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


Similar News