దిశ ఎఫెక్ట్…సమస్యను పరిష్కరించిన అధికారులు
మెదక్ - జోగిపేట రహదారి నుండి చిలిపి చెడ్ మండలం చిట్కుల్ గ్రామానికి వెళ్లే రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడింది
దిశ,చిలిపిచెడ్: మెదక్ - జోగిపేట రహదారి నుండి చిలిపి చెడ్ మండలం చిట్కుల్ గ్రామానికి వెళ్లే రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్య ఏర్పడి గత మూడు నెలల కావస్తోంది. దీంతో ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన దిశ దిన పత్రిక గత నెల 25 వ తేదీన ప్రమాదకరంగా" మ్యాన్ హోల్ " అనే కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి సోమవారం సంబంధిత అధికారులు స్పందించారు. ప్రమాదకరంగా ఏర్పడిన గుంత ను జెసిబి సహాయంతో పనులను చేపట్టారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన దిశ దిన పత్రికకు ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.