ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ఆదేశించారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చి వారి నుంచి అర్జీలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజలు ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజావాణిలో భూ సంబంధిత, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ తదితర సమస్యల పరిష్కారం కోసం మొత్తం 75 అర్జీలు వచ్చినట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నాగ రాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.