రేపు తునికికి ఉపరాష్ట్రపతి రాక
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ,
దిశ, కౌడిపల్లి: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, కేంద్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామ శివారులోని కృషి విజ్ఞాన కేంద్రం కు విచ్చేస్తున్నారని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త శంబాజీ దత్తాత్రేయ నల్కర్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని వివిధ గ్రామాలలో సేంద్రీయ పద్ధతులలో వివిధ పంటలు సాగు చేస్తున్న 800 మంది రైతులు, 300 మంది ఇతర రైతులతో ఉపరాష్ట్రపతి సమావేశమై నేరుగా మాట్లాడుతారు. సేంద్రీయ ఉత్పత్తుల స్టాళ్ళ ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తారు. ఉపరాష్ట్రపతి తునికి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గత వారం రోజుల నుంచి కృషి విజ్ఞాన కేంద్రాంను పరిశీలిస్తూ అధికారులకు సిబ్బందికి సూచనలు చేశారు.