ప్రజలను నయవంచన చేసింది….

దిశ ప్రతినిధి, మెదక్: ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం నయవంచన చేస్తూ, నిజాం తరహా పాలనను సాగిస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అన్నారు. వేములఘాట్ గ్రామంలో ఆయన ఉప ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్, మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు సీఎం కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించడంలో సవితి తల్లి ప్రేమను కేసీఆర్ చూపారని అన్నారు. […]

Update: 2020-10-19 09:13 GMT

దిశ ప్రతినిధి, మెదక్: ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం నయవంచన చేస్తూ, నిజాం తరహా పాలనను సాగిస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అన్నారు. వేములఘాట్ గ్రామంలో ఆయన ఉప ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్, మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు సీఎం కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించడంలో సవితి తల్లి ప్రేమను కేసీఆర్ చూపారని అన్నారు. పక్కన ఉన్న గజ్వేల్, సిద్దిపేటలకు వేరే విధమైన పరిహారం అందజేసి మిరుదొడ్డి, తొగుట ప్రజలను మోసం చేశారని వెల్లడించారు. తాము అధికారంలోకి రాగానే మల్లన్న సాగర్ ముంపు గ్రామ రైతులకు న్యాయం చేస్తామన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. వేములఘట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు.

Tags:    

Similar News