Ram Charan: ‘గేమ్ ఛేంజర్’కు భారీ ఎదురుదెబ్బ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది...
దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. దేశ వ్యాప్తంగా ఈ మూవీ శుక్రవారం విడుదల అయింది. ఏపీలో బెన్‌ఫిట్ షోలు వేశారు. అన్ని చోట్ల తెల్లవారుజామున నాలుగు గంటలకే సినిమా రిలీజ్ అయింది. ఇంతకాలం ఆతృతగా ఎదురు చూసిన ఫ్యాన్స్ మొత్తం థియేటర్ వద్ద క్యూ కట్టి సినిమాను చూశారు. సినిమా ప్రారంభం నుంచే సౌండ్ బాక్సులే దద్దరిల్లిపోయేలా ఫ్యాన్స్ హడావుడి చేశారు. మూవీ ప్రారంభంలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ నుంచే అరుపులు, కేకలు, విజిల్స్‌తో అదరగొట్టారు. పాటలకు, ఫైట్స్‌కు రచ్చ రచ్చ చేశారు. సినిమా అదిరిపోయిదంటూ బయటకు వచ్చి చెప్పారు. దీంతో సినిమాపై ఫ్యాన్స్‌కు ఓ అంచనా వచ్చేసింది.
అందరి చూపు కలెక్షన్స్ వైపు
అయితే ఇప్పుడు అందరి చూపు కలెక్షన్స్ వైపు పడింది. ‘ఈ మూవీకి ఎన్ని డబ్బులు వస్తాయి... అల్లు అర్జున్ పుష్పా-2(Puspa-2)ను కొట్టివేస్తుందా అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మెగా, అల్లు ఫ్యాన్స్‌లో అధిపత్య పోరు కొనసాగుతోంది. పుష్పా-2 బ్లాక్ బస్టర్ కావడంతో ఈ పోరు మరింత పెరిగింది. అల్లు అర్జున్ రికార్డులను తిరగరాసే సత్తా ఒక్క చరణ్ కే ఉందంటూ మెగా పవర్ అభిమానులు సోషల్ మీడియాలో హల్ చేశారు. దీనంతటికి రామ్ చరణ్ మగధీర, త్రిబుల్ ఆర్ మూవీలే కారణం. మగధీర అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. రీసెంట్ ఎన్టీఆర్ కలిసి వచ్చి త్రిబుల్ ఆర్ తోనూ రామ్ చరణ్ రికార్డులు సృష్టించింది. దీంతో గేమ్ ఛేంజర్ మూవీపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. పైగా త్రిబుల్ తర్వాత రామ్ చరణ్ సోలోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రూ. 450 కోట్లు పెట్టి ఈ గేమ్ ఛేంజర్ మూవీని భారీ స్థాయిలో తెరక్కించారు. దీంతో విడుదలకే ముందే ఈ మూవీ అంచనాలకు మించిపోయింది. సినిమా కచ్చితంగా హిట్టు అవుతుందని, కలెక్షన్లలోనూ రికార్డులు బద్ధలు కొడుతుందని నిర్మాతలు, ఫ్యాన్స్ అంచనా వేశారు. ఈ మేరకు ప్యాన్ ఇండియా లెవల్‌లో మూవీని రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు. శంకర్ డైరెక్షన్ చిత్రం రావడంతో రికార్డులు తిరగరాస్తుందని ఆశలు పెట్టుకున్నారు.
‘గేమ్ ఛేంజర్’కు పుష్పా గట్టి దెబ్బ
అయితే ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు అల్లు అర్జున్ సినిమా గట్టిగా దెబ్బకొట్టింది. పుష్పా-2 అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. బాహుబలి-2 సైతం మించిపోయి రికార్డు కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’పై పడింది. షరతులతో కూడిన అనుమతులతో తెలంగాణలో సినిమా విడుదలైంది. ఈ సినిమాకు తెలంగాణలో బెన్ ఫిట్ షోలు అనుమతించలేదు. స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్స్‌ను హైక్ చేశారు. కానీ పుష్పా-2 రేంజ్‌లో మాత్రం అనుమతి దొరకలేదు. పుష్పా-2 కొన్ని ఏరియాల్లో 1500 నుంచి 2000కు టికెట్స్ అమ్మారు. అంతేకాదు అయితే పుష్పా-2 లాంగ్ రన్‌లో కూడా డబ్బులు భారీగా రాబట్టింది. కానీ రామ్ చరణ్ మూవీకి ఆ ఛాన్స్ లేకుండా పోయింది. హైక్ చేసినా లిమిట్స్ పెట్టారు. దీంతో కలెక్షన్ల ఎఫెక్స్ విపరీతంగా పడింది. అభిమానులు సినిమా చూశారు. సినిమా రికార్డ్స్‌పై పెట్టుకున్న అంచనాలు కొంచెం తగ్గినట్లుగా మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. శంకర్-చరణ్ కావడంతో పుష్పా-2ను ఈజీగా కొట్టేస్తుందని ఆశించారు. కానీ పుష్పా-2 సినిమా ఎఫెక్ట్‌తో ఆ స్థాయి కలెక్షన్లు వస్తాయనే నమ్మకం పోయినట్లుగా ఫ్యాన్స్ ముఖంలో కనిపిస్తుంది. తమ హీరో రికార్డులు బద్ధలుకొడతారని సినిమా విడుదలకు చెప్పినట్లుగా ఇప్పుడు చెప్పడం లేదు. సినిమా బాగానే ఉన్నా ఏదో తెలియని ఆవేదనకు గురి అవుతున్నారు. ప్రస్తుతానికి థియేటర్లన్నీ ఫుల్ అవుతున్నాయని, సంక్రాంతి వరకూ సినిమాకు ఎదురులేదని చెబుతున్నారు.
మారిపోయిన ఫ్యాన్స్ ఫీలింగ్స్
కానీ పుష్పా-2 ఎఫెక్ట్ తమ హీరో సినిమా గేమ్ ఛేంజర్‌పై భారీగా పడిందని ఫీల్ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఫ్యాన్స్ సినిమాను చూసేశారు. సంక్రాంతి కావడంతో సాధారణ ప్రేక్షకుల కూడా ఈ మూవీ చూసే అవకాశం ఉంది. మరోవైపు సంక్రాంతి కానుకగా సీనియర్ హీరోలు బాలయ్య, వెంకటేశ్ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలను తట్టుకుని పుష్పా-2 సినిమా రికార్డులను తుడిపేయడం కష్టమేనని ఫ్యాన్స్ చెవులు కొరుక్కుంటున్నారు. చూడాలని మరి ఏం జరుగుతుందో.