Nidhi Agarwal: ‘ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ రావొద్దనే ఆ ప్రమోషన్స్ చేస్తున్నాను’: నిధి అగర్వాల్

హీరోయిన్ నిధి అగర్వాల్(Heroine Nidhi Agarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2025-01-10 14:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ నిధి అగర్వాల్(Heroine Nidhi Agarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కెరీర్ మొదట్లో కొన్ని ఫ్లాప్‌ సినిమాలు చవిచూసినప్పటికీ.. పోనూ పోనూ ఈ అమ్మడు నటించిన చిత్రాలకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ది రాజాసాబ్(The Rajasab), హరిహర వీరమల్లు(Harihara Veeramallu)’ సినిమాలతో బిజీగా ఉంది. ఒకేసారి రెండు చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఇకపోతే హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

2022 లో రిలీజ్ అయిన హీరో అనంతరం గ్యాప్ గురించి ప్రశ్నించగా.. నిధి బదులిస్తూ.. గ్యాప్ తీసుకోలేదని.. కానీ పలు రీజన్స్ వల్ల వచ్చిందని చెప్పుకొచ్చింది. ఫస్టే హరిహర వీరమల్లు సినిమా కోసం సైన్ చేశానని, అప్పుడు నేను ఎలాంటి గ్యాప్ తీసుకోలేదని వెల్లడించింది. ఇక కొన్ని డేస్ తర్వాతనే లాక్ డౌన్ వచ్చిందని పేర్కొంది. అనంతరం కొన్ని సీన్స్ షూట్స్ చేశానని, మళ్లీ రెండోసారి కరోనా కారణంగా చిత్రీకరణ ఆపేశానని చెప్పింది. ఇక వేరే సినిమాలకు సంతకం పెట్టవద్దని చిత్ర బృందం తనతో ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొంది.

ఇక ది రాజాసాబ్ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు.. హరిహర వీరమల్లు టీమ్ ను అప్రోచ్ అయ్యి.. ఓ మాట అడిగానని.. దీంతో వారు యాక్సెప్ట్ చేశారని వెల్లడించింది. కానీ రెండు మూవీలపై పూర్తి నమ్మకంతో ఉన్నానని తెలిపింది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావొద్దని తాను బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్నానని పేర్కొంది. అలాగే తన వెయిట్ గురించి మాట్లాడుతూ.. చిన్నప్పుడు సన్నగా ఉండేదాన్ని అని.. చాలా మంది లావు కావాలని సలహా ఇవ్వడంతో .. కరోనా టైంలో కాస్త బొద్దుగా అయ్యానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Tags:    

Similar News