Hina Khan: ‘మొదటగా దానికే ప్రయారిటీ ఇస్తా’.. నటి సెన్సేషనల్ కామెంట్స్

రొమ్ము క్యాన్సర్‌ తో పోరాటం చేస్తున్నానని గత ఏడాది ప్రకటించిన బాలీవుడ్ నటి హీనా ఖాన్ (Actress Hina Khan)తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు విషయాలు పంచుకుంది.

Update: 2025-01-10 13:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నానని గత ఏడాది ప్రకటించిన బాలీవుడ్ నటి హీనా ఖాన్ (Actress Hina Khan)తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు విషయాలు పంచుకుంది. ‘యే రిష్తా క్యా కెహ్‌లాతా హై’(Ye Rishta Kya Kehlata Hai) అనే హిందీ సీరియల్‌తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ నటి వర్క్ లైఫ్ నుంచి కాస్త విరామం తీసుకున్నట్లు వెల్లడించింది. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గృహలక్ష్మి(Grilahakshmi) ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. మనం తెరపై కనిపించకపోతే ప్రేక్షకులు మనల్ని మర్చిపోతారని.. ఇది మాత్రం కఠిన వాస్తవమని చెప్పుకొచ్చింది.

కాగా క్యాన్సర్ తో పోరాడుతోన్నప్పుడు కూడా కెరీర్‌ పైన కంటే హెల్త్‌పైన్నే ఎక్కువ ఫోకస్ పెట్టానని పేర్కొంది. నాకే కాదు.. అందరికీ ఆరోగ్యమే ముఖ్యమేనని తెలిపింది. క్యాన్సర్(Cancer) వచ్చినప్పుడు.. ఆ సమయంలో చాలా ప్రాజెక్టులు మిస్ అయ్యాయని వెల్లడించింది. కానీ మొదటగా హెల్త్ కే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది నటి హీనా ఖాన్. ప్రజెంట్ మళ్లీ బిజీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానని తెలిపింది.

ఇక నటి హీనా ఖాన్ స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గత సంవత్సరం జూన్ నెలలో సోషల్ మీడియా ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్‌తో క్యాన్సర్‌ నుంచి బయటపడ్డానని పేర్కొంది. ప్రెజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని.. తప్పకుండా ఈ వ్యాధి నుంచి కోలుకుంటానని నమ్మకంతో చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News