Padi Kaushik Reddy : 500 కోట్లకు అమ్ముడుపోయి అదనపు షోలకు అనుమతించారు : పాడి కౌశిక్ రెడ్డి

సినిమా ఇండస్ట్రీ(Film Industry) నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రూ.500కోట్లు తీసుకుని గేమ్ ఛేంజర్(Game changer)సినిమాకు అదనపు షోలుBenefit shows, టికెట్ల ధరలు పెంపు(Ticket prices increase)కు అనుమతించా(Permission)డని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) ఆరోపించారు.

Update: 2025-01-10 11:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీ(Film Industry) నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రూ.500కోట్లు తీసుకుని గేమ్ ఛేంజర్(Game changer)సినిమాకు అదనపు షోలుBenefit shows, టికెట్ల ధరలు పెంపు(Ticket prices increase)కు అనుమతించా(Permission)డని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) ఆరోపించారు. డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన..అల్లు అర్జున్ అరెస్టు వివాదాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి తాను సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో సినిమాల టికెట్ల ధరల పెంపుకు, అదనపు షోలకు అనుమతించేది లేదని ప్రకటించారని గుర్తు చేశారు.

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చేసిన ప్రకటనకు విలువ లేకుండా చేసి, సినిమా టికెట్ల ధరల పెంపు, అదనపు షోలపై యూటర్న్ తీసుకోవడం సిగ్గుచేటన్నారు. టికెట్ రేట్లు పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వడం ప్రజలను మోసం చేయడమేనని, అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా ? అని.. అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతి ఇవ్వడం సభను అవమానించడమే అవుతుందన్నారు.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్, నిర్మాత దిల్ రాజును అడ్డం పెట్టుకుని సినిమా ఇండస్ట్రీ వాళ్లను బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి రూ.500కోట్లు తీసుకుని , గేమ్ ఛేంజర్ సినిమాకు అదనపు షోలు, టికెట్ల ధరల పెంపుకు రేవంత్ రెడ్డి అనుమతించడాన్ని, దీనిపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారన్న సోయి, సిగ్గులేదా అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

Tags:    

Similar News