Telangana Congress: మహిళా విభాగం కార్యవర్గం ప్రకటన

హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌(Indira Bhavan)లో మహిళా కాంగ్రెస్(Congress Women's Wing) రాష్ట్ర కార్యవర్గాన్ని.. రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు(Sunitha Rao) ప్రకటించారు.

Update: 2025-01-10 10:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌(Indira Bhavan)లో మహిళా కాంగ్రెస్(Congress Women's Wing) రాష్ట్ర కార్యవర్గాన్ని.. రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు(Sunitha Rao) ప్రకటించారు. ఈ సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల నియామక పత్రాలను సునీతా రావు అందజేశారు. జాతీయ మహిళా కాంగ్రెస్(National Women's Congress) అధ్యక్షురాలు ఆల్కలంబా ఆదేశాల మేరకు ఏఐసీసీ(AICC) పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని సునీతా రావు సూచించారు. మూడేళ్ల నుంచి టీపీసీసీ మహిళా కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కాంగ్రెస్ విజయానికి కృషి చేసిందని అన్నారు.

గతంలో ఆన్లైన్ సభ్యత్వాలు చేసి ఎక్కువ సభ్యత్వం చేసిన వారికి పదవులు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. 500 సభ్యత్వాలు చేసిన వారికి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించినట్లు తెలిపారు. అందులో 17 జిల్లాలకు ఈరోజు లేఖలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 11 మంది, ప్రధాన కార్యదర్శులుగా నలుగురికి, 18 మందికి కార్యదర్శులుగా లేఖలు ఇవ్వడం జరిగిందని అన్నారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అండగా ఉండాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ చేస్తున్న నియంతృత్వ పాలనపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మిగతా పెండింగ్ జిల్లాల అధ్యక్షుల నియామకం త్వరలో చేపడుతామని సునీతా రావు వివరించారు.

Tags:    

Similar News