భరతమాత గొప్పయోధున్ని కోల్పోయింది: శ్రీవర్ధన్ రెడ్డి

దిశ, షాద్ నగర్: హెలికాప్టర్ ప్రమాదంలో భారతదేశం గొప్పయోధున్ని కోల్పోయిందని బీజేపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. తమిళనాడు హెలికాప్టర్ దుర్ఘటనలో సీడీఎస్ చీఫ్ బీపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్, మృతిచెందిన ఆర్మీ జవానులకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బీజేపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం శత్రుదేశాల కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ శత్రువుల గుండెల్లో సింహస్వప్నంలా ఉన్న సీడీఎస్ […]

Update: 2021-12-09 04:54 GMT

దిశ, షాద్ నగర్: హెలికాప్టర్ ప్రమాదంలో భారతదేశం గొప్పయోధున్ని కోల్పోయిందని బీజేపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. తమిళనాడు హెలికాప్టర్ దుర్ఘటనలో సీడీఎస్ చీఫ్ బీపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్, మృతిచెందిన ఆర్మీ జవానులకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బీజేపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం శత్రుదేశాల కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ శత్రువుల గుండెల్లో సింహస్వప్నంలా ఉన్న సీడీఎస్ చీఫ్ బీపిన్ రావత్ మృతి దేశానికి తీరనిలోటు అని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మఠం ఋషికేష్, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, మల్చలం మురళి, వంశీకృష్ణ, వెంకటేష్, మోహన్ సింగ్, హరీష్ ముదిరాజ్, శ్రీనివాస్ చారి, శ్రీకాంత్ యాదవ్, గజ్జల ప్రవీణ్, శ్యాం సుందర్ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..