సీతంపేటలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు..
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామంలోని హైస్కూల్ వద్ద సోమవారం తెల్లవారుజామున మహబూబాబాద్ కు చెందిన దొడ్ల పాల వ్యానును వరి కోత మిషన్ ఢీ కొట్టింది.
దిశ, గార్ల : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామంలోని హైస్కూల్ వద్ద సోమవారం తెల్లవారుజామున మహబూబాబాద్ కు చెందిన దొడ్ల పాల వ్యానును వరి కోత మిషన్ ఢీ కొట్టింది. దీంతో పాల వ్యాన్ డ్రైవర్ రమేష్ తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు రమేష్ ను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ లోని ధరణి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. వరి కోత మిషన్ తో సహా డ్రైవర్ పారిపోయినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.