విద్యుత్ స్తంభానికి ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య...

విద్యుత్ స్తంభానికి ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-12-23 04:47 GMT

దిశ, చిన్నశంకరంపేట : విద్యుత్ స్తంభానికి ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మిర్జాపల్లికి చెందిన చింతల సిద్ధిరాములు (45) పెయింటర్ గా విధులు నిర్వహించేవాడు. అర్ధరాత్రి ఇంటి పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Similar News