గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడి.. నలుగురికి సీరియస్

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్ళిన 18 మంది గిరిజనులపై అటవీ శాఖ అధికారులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ సంఘటన అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్ గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. జిల్లాలోని అచ్చంపేట మండలం పలుగు తండాకు చెందిన గిరిజనులు గత మూడు రోజుల క్రితం అమ్రాబాద్ మండలం అడవిలో వెళ్లారు. అనంతరం […]

Update: 2021-03-26 22:19 GMT

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్ళిన 18 మంది గిరిజనులపై అటవీ శాఖ అధికారులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ సంఘటన అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్ గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. జిల్లాలోని అచ్చంపేట మండలం పలుగు తండాకు చెందిన గిరిజనులు గత మూడు రోజుల క్రితం అమ్రాబాద్ మండలం అడవిలో వెళ్లారు. అనంతరం గమనించిన అటవీశాఖ ఫైర్ సిబ్బంది వారిపై విచక్షణా దాడి చేశారు. ఈ దాడిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా, మరో 14 మంది ఆయాసంతో బాధపడుతూ కాలినడకన మన్ననూర్ బేస్ క్యాంప్ వద్దకు చేరుకున్నారు.

అటవీశాఖ దాడిలో ప్రమాదానికి గురైన గిరిజనులు

అటవీశాఖ సిబ్బంది దాడిలో.. కేతావత్ పీపీపీ, మాగ్నవత్ దివాలి, కేతావత్ తారా సింగ్, మూడవ జక్కి, కేతావత్ అంత్లీ, కేతావత్ వాలి, మూడవ హాతిరామ్, కేతావత్ తిరుపతమ్మ, కేతావత్ మంత్రి, మూడవ జమిలి, మూడవ జయ, మూడవ శాంతి, మూడవ తిరుపతమ్మ, మెగావత్ గిల్లు, కేతావత్‌లను కింద పడేసి కర్రలతో కొడుతూ కాళ్లతో తన్ని దాడి చేశారు. నొప్పి భరించలేక బాధితులు రోదిస్తూ విషయం వెల్లడించారు. అలాగే మరో ఇద్దరిని గొడ్డలితో కాలుపై దాడి చేశారని వాపోయారు. ఈ దాడిలో గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు.

ఆగ్రహానికి గురైన బంధువులు..

తమ కుటుంబ సభ్యులను అటవీశాఖ అధికారులు దాడి చేశారని విషయం తీసుకున్న బాధిత కుటంబసభ్యులు, గ్రామస్తులు, మన్ననూర్ బేస్ క్యాంపు వద్దకు చేరుకున్నారు. శనివారం ఉదయం శ్రీశైలం-హైదరాబాద్ వైపు నుంచి అటవీశాఖ జీపులో వస్తున్న సిబ్బందిపై బాధిత బంధువులు ప్రతి దాడులు చేశారు. ఈ దాడిలో అటవీశాఖ సెక్షన్ అధికారి రామంజనేయులు, ఇతర వాచర్లు నిరంజన్, యాదయ్య, శ్రీనివాసులు, డ్రైవర్ రైమోద్దీన్ స్వల్ప గాయాలు అయ్మాయి. ఈ క్రమంలో వారు పరుగులు తీస్తూ తప్పించుకున్నారు. మరో ఇద్దరిని బేస్ క్యాంపు గదిలో బంధించారు.

శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా

హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిలోని అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ విశాఖ బేస్ క్యాంపు వద్ద బాధితులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని సర్దిచెబుతుండగా.. ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అటవీశాఖ ఉన్నతాధికారులు వచ్చి దాడులు చేసిన అటవీశాఖ అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు

Tags:    

Similar News