Viral News : హైదరాబాద్‌లో వింత వాతావరణం
ఎండాకాలం(Summer) మొదలవడంతోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఎండాకాలం(Summer) మొదలవడంతోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలంగాణ, ఏపీల్లోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పగటిపూట ఎండ వేడి(HeatWave)కి, వడగాలుల తీవ్రతకు ప్రజలు అల్లాడుతున్నారు. అయితే విచిత్రంగా ఒక గ్రామంలో మాత్రం పొగమంచు(Haze) కురుస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్(Hyderabad) నగర శివార్లలోని ఘట్ కేసర్ మండలంలోని ప్రతాపసింగారంలో విచత్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ గ్రామం, దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున భారీ పొగమంచు కురుస్తోంది. దట్టమైన పొగమంచు కురుస్తూ ఉండగానే మరోవైపు సూర్యుడు ఎండ కాస్తున్నాడు. ఉదయం పూట ఇలాంటి వింత వాతావరణం కనిపిస్తుండటంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కాగా ఈ వింత వాతావరణం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే పగలు వేడిగా ఉండి, తెల్లవారుజామున అత్యంత చల్లగా ఉండటం సాధారణమే అని, రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల చల్లగాలులు వీస్తున్నాయని.. రేయపతి నుంచి రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.