Viral video: పదిమందికి గుర్తుండేలా పెళ్లిచేసుకోవాలనుకున్నారు.. కానీ ఇంతలోనే..!
పెళ్లంటే నూరేళ్ల పంట.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో ఒక్కసారి చేసుకుంటాం, కాబట్టి జీవితాంతం గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇక నేటి తరం యువత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సందర్భాలేవైనా ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. ఈ క్రమంలో చాలా జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లు చేసుకుంటున్నాయి. అలాగే, ఈ జంట కూడా తమ పెళ్లి స్మృతులను కెమెరాల్లో బంధించుకోవాలని ప్రీ వెడ్డింగ్ షూట్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్నారు. అయితే, చివరికి అదే వారి పాలిట శాపమైంది. వధువును ఆస్పత్రి పాలుజేసింది.
భారత సంతతికి చెందిన విక్కీ, ప్రియా జంట తమ వివాహం కోసం కెనడా (Canada) నుంచి స్వదేశానికి వచ్చారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి వేడుకను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో వివాహ వేడుక రోజున వధువరులిద్దరూ ఫొటో షూట్ ప్లాన్ చేసుకున్నారు. ఫొటోలు అందంగా వచ్చేందుకు కలర్ బాంబులను వాడారు. అయితే, వీరిద్దరూ ఫొటోలకు, వీడియోలకు ఫోజులిస్తుండగా.. ఒక్కసారిగా వారి పక్కనే స్పెషల్ ఎట్రాక్షన్ కోసం ఏర్పాటు చేసిన కలర్ బాంబ్ పేలింది. బాంబు నుంచి మంటలు వచ్చి వధువుపై పడ్డాయి. ఈ ఘటనలో ఆమె జుట్టు.. వెనుక భాగం కాలిపోయింది. దీంతో, ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. అనంతరం యథావిధిగా పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో (Social media) షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందనే వివరాలు వెల్లడి కాలేదు.
Read More..
అలియా నా మొదటి భార్య కాదు.. బిగ్ షాకిచ్చిన రణ్‌బీర్ కపూర్?