Pizza Tip: టిప్‌ తక్కువ ఇచ్చిందని ప్రెగ్నెంట్‌ను 14సార్లు బాదిన డెలవరీ బాయ్!

Pizza Tip: మనుషులకు ఓపిక, సహనం నశిస్తోంది.

Update: 2025-03-24 07:17 GMT
Pizza Tip: టిప్‌ తక్కువ ఇచ్చిందని ప్రెగ్నెంట్‌ను 14సార్లు బాదిన డెలవరీ బాయ్!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : Pizza Tip: మనుషులకు ఓపిక, సహనం నశిస్తోంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకుంటున్నారు. అవి కాస్త హింసాత్మకంగా మారుతున్నాయి. పురుషులే కాదు మహిళలు కూడా వయెలెంట్ గా మారుతున్నారు. కేవలం చిల్లర డబ్బుల విషయంలో ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. గర్భవతి అని కూడా చూడకుండా ఓ యువతి ఆ గర్భవతిని అతి దారుణంగా 14సార్లు కత్తితో పొడిచింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాలు చూస్తే అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓసియోలా కౌంటీలో ఒక బ్రియాన్నా అల్వేలో అనే 22 ఏళ్ల యువతి మార్కోస్ పిజ్జా రెస్టారెంట్ లో పిజ్జా డెలివరీ వర్కర్ గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఓసియోలా కౌంటీలోని ఓ మొటేల్ లో ఒక మహిళ పిజ్జా ఆర్డర్ చేసింది. దీంతో బ్రియాన్నా పిజ్జా డెలివరీ కోసం వెళ్లింది. మొటేల్ వెళ్లాక చూస్తే..పిజ్జా ఆర్డర్ చేసిన మహిళ గర్భవతి. అందుకే మొటేల్ పై ఫోర్ వరకు డెలివరీ కోసం వెళ్లాల్సి వచ్చింది.

పిజ్జా బిల్ మొత్తం 33 డాలర్లు అయ్యింది. దీంతో ఆ గర్భవతి కస్టమర్ బ్రియాన్నకు 50 డాలర్లు ఇచ్చింది. దీంతో బ్రియాన్నా తనకు ఆమె 17 డాలర్లు టిప్ ఇచ్చిందని సంతోషపడి థ్యాంక్స్ అని చెబుతూ వెనుదిరిగి వెళ్లిపోవడం మొదలుపెట్టింది. కానీ అంతలోనే ఆ గర్భవతి కస్టమర్ తనకు బ్యాలెన్స్ ఇచ్చి వెళ్లాలని అడిగింది. ఆమె మాటలకు బ్రియాన్నా ఖంగుతింది. అయినా తెలివిగా తన దగ్గర 50 డాలర్లకు చిల్లర లేదని సమాధానం చెప్పింది. దీంతో ఆ గర్భవతి అయినంత మాత్రాన నువ్వు మొత్తం 50 డాలర్లు ఎలా తీసుకుంటావ్ అంటూ ప్రశ్నించింది.

అందుకే 50 డాలర్లు వెనక్కి తీసుకోని లోపలికి వెళ్లి33డాలర్ల పరిపడ నోట్లు తీసుకువచ్చి ఆమె చేతిలో పెట్టింది. అయినా బ్రియాన్న సంత్రుప్తి చెందలేదు. తాను ఎంతో కష్టపడి పిజ్జా తీసుకువచ్చానని పై ఫ్లోర్ వరకు పిజ్జా తెచ్చినందుకు టిప్ ఇవ్వాలని గట్టిగా అడిగింది. బ్రియాన్నా ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ గర్భవతి కస్టమర్ 2డాలర్లు టిప్ ఇచ్చింది. అది చూసి బ్రియాన్నాకు పట్టరాని కోపం వచ్చింది. 2 డాలర్లు ఏంటీ అంటూ ప్రశ్నించింది. దీంతో ఆ కస్టమర్ బ్రియాన్నాను తిట్టింది. టిప్ అడిగి మరీ తీసుకుంటున్నావు..ఇచ్చాక ఇంతేనా అంటున్నావు. నీ వ్యవహారం బాగలేదు. నీ పనితనం సరిగ్గా లేదని కంప్లెయింట్ చేస్తానని చెప్పింది.

సదరు మహిళ ఆ మాట అనేసరికి బ్రియాన్నా అక్కడి నుంచి వెళ్లిపోయి..కాసేపటికి తన బాయ్ ఫ్రెండ్ తో ఒక కారులో వచ్చింది. ఆ బ్రాయ్ ఫ్రెండు ముఖానికి ముసుగు వేసుకుని చేతిలో తుపాకీ తీసుకుని వచ్చాడు. బ్రియాన్నా చేతిలో కత్తి పట్టుకుని వచ్చి కస్టమర్ ఇంటి తలుపులు బాదారు. లోపలికి వెళ్లి తుపాకీతో బెదిరించారు. గర్భవతిని 14సార్లు కత్తితో పొడిచారు. అక్కడి నుంచి పారిపోయారు. మొటేల్ యాజమాన్యం ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ గర్భవతిని ఆసుపత్రికి తరలించారు. బ్రియాన్నా, ఆమె బాయ్ ఫ్రెండ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 

Tags:    

Similar News