మారుతున్న రాఖీ ట్రెండ్!

‘అన్నాచెల్లెలి అనుబంధం.. జన్మజన్మలా సంబంధం’ అని పాటలు పాడుకునే రోజులు కావివి. ఆరోగ్యంతో అనుబంధంగా ఉండాలంటే ఈసారి అన్నాచెల్లెలి అనుబంధానికి బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెల్లెళ్లు కట్టిన రాఖీలతో చేతులు నింపుకునే అన్నలు, తమ్ముళ్లు ఇప్పుడు రాఖీని చేతితో అందుకోవాలని అనుకుంటున్నారు. సొంతవాళ్లతో కాకుండా, కజిన్ సిస్టర్లతో కూడా రాఖీలు కట్టించుకునేవాళ్లు ఇప్పుడు సొంతవాళ్లు వస్తామంటేనే వద్దు అంటున్నారు. ఈ కరోనా మహమ్మారి పట్నం నుంచి పల్లెలకు చేరుకోవడమే ఇందుకు కారణం. అయితే ఉపాయం ఉన్నోడికి […]

Update: 2020-07-30 00:26 GMT

‘అన్నాచెల్లెలి అనుబంధం.. జన్మజన్మలా సంబంధం’ అని పాటలు పాడుకునే రోజులు కావివి. ఆరోగ్యంతో అనుబంధంగా ఉండాలంటే ఈసారి అన్నాచెల్లెలి అనుబంధానికి బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెల్లెళ్లు కట్టిన రాఖీలతో చేతులు నింపుకునే అన్నలు, తమ్ముళ్లు ఇప్పుడు రాఖీని చేతితో అందుకోవాలని అనుకుంటున్నారు. సొంతవాళ్లతో కాకుండా, కజిన్ సిస్టర్లతో కూడా రాఖీలు కట్టించుకునేవాళ్లు ఇప్పుడు సొంతవాళ్లు వస్తామంటేనే వద్దు అంటున్నారు. ఈ కరోనా మహమ్మారి పట్నం నుంచి పల్లెలకు చేరుకోవడమే ఇందుకు కారణం. అయితే ఉపాయం ఉన్నోడికి ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కునే సమర్థత ఉంటుంది. అందుకే మార్కెటింగ్ వాళ్లు ‘రాఖీ కిట్స్’ పేరుతో కరోనాకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఈసారి రాఖీ జరుపుకోవాలంటే చెల్లెళ్ల మీద ప్రేమతో పాటు కొంచెం ధైర్యం కూడా కావాల్సిందే!

ఆగస్టు రాగానే రాఖీలు సిద్ధమవుతాయి. కానీ ఈసారి రాఖీలతో పాటు శానిటైజర్లు, మాస్కులు కూడా సిద్ధమవుతున్నాయి. ఎలాగూ ఊరంతా తిరిగి షాపింగ్ చేసి మంచి రాఖీని ఎంచుకునేంత సీన్ లేదు కాబట్టి, రాఖీ కిట్స్ అని కొత్తవి మార్కెట్లోకి వచ్చాయి. ఈ కిట్‌లో ఒక రాఖీ, చిన్న శానిటైజర్ డబ్బా, రెండు మాస్కులు, రెండు స్వీట్‌లు ఉంటున్నాయి. కేవలం రాఖీల మార్కెటింగ్‌లోనే కాదు, రాఖీ పండగ జరుపుకోవడంలో కూడా చాలా మార్పులు సంతరించుకోనున్నాయి. ఇప్పటికే అందరూ హైదరాబాద్ నుంచి గ్రామాలకు వచ్చేశారు. దీంతో జిల్లాల్లో దాదాపు 70 శాతం గ్రామాలు కంటైన్మైంట్ జోన్లుగా మారాయి. కాబట్టి ఈ రాఖీ పండగకి అన్న దగ్గరికి వెళ్దామనుకున్న చెల్లెలికి పెద్ద ఇబ్బందే ఎదురుకాబోతోంది.

అయితే శానిటైజర్, మాస్కులు ధరించి రాఖీ కట్టుకోవడం వల్ల కరోనా వ్యాపించదా? అనే ప్రశ్న అందరికీ తలెత్తుతోంది. దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా, రాఖీ పండగ జరగకుండా ఎవరూ ఆపలేరు కాబట్టి శానిటైజర్లు, మాస్కులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సంవత్సరాలుగా ప్రతి రాఖీ పండక్కి కచ్చితంగా ఇంటికి వచ్చే సోదరితో ఈసారి సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం వస్తోంది. ఒకవేళ అలా పాటించకపోతే 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ పాటించాలి. అందుకని వీలైనంత మేరకు ముట్టుకోకుండా రాఖీని చేతికిచ్చి, స్వీట్‌ను ప్లేట్‌లో పెట్టి, బొట్టు ఎవరికి వారే పెట్టుకుని పండగ జరుపుకోవడం మంచిది. ఇవేవీ పాటించకుండా ఎప్పటిలాగే చేసుకునేటట్లయితే రాఖీ పండగ పూట కరోనాకు దారి కల్పించినట్లే అవుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి. అలాగని సోదరుడు ఇచ్చే బహుమతిని మాత్రం మర్చిపోకండి. అది చాలా ముఖ్యం!

Tags:    

Similar News