TFI: సంధ్య థియేటర్ ఘటన.. విరాళాలు సేకరించాలని తెలుగు ఫిల్మ్ చాంబర్ నిర్ణయం
హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్(Telugu Film Chamber) కార్యాలయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కీలక సమావేశం నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్(Telugu Film Chamber) కార్యాలయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కీలక సమావేశం నిర్వహించారు. సంధ్య థియేటర్(Sandhya Theater) ఘటన, బెనిఫిట్ షోల రద్దు, టికెట్ల ధరల పెంపుపై చర్చించారు. అనంతరం విరాళాలు సేకరించి బాలుడు శ్రీతేజ్(Sri Tej)కు అందివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. సమావేశానికి ముందు నిర్మాత నాగవంశీ(Producer Nagavanshi) కీలక వ్యాఖ్యలు చేశారు.
సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదు. తెల్లవారుజామున 4.30కి సినిమా పడితే చాలు. ఈ విషయాలను అమెరికాలో ఉన్న ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు హైదరాబాద్‌కు వచ్చాక.. అందరం కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చిస్తామని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుద్దామని ఎవరూ చెప్పలేదన్నారు. సినీ ఇండస్ట్రీకి ఏపీ సపోర్టు ఎప్పుడూ ఉంటుందని ఫస్ట్ మీటింగ్‌లోనే పవన్ చెప్పారు. ఆ సపోర్ట్ అలాగే ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.