లెజెండరీ సాహసం.. బర్డ్‌మ్యాన్ హాక్ రక్తంతో స్కేట్ బోర్డ్స్

దిశ, ఫీచర్స్ : క్యాన్డ్ వాటర్ కంపెనీ ‘లిక్విడ్ డెత్‌’ బ్రాండ్ అంబాసిడర్‌‌గా ఫేమస్ అమెరికన్, ప్రొఫెషనల్ స్కేట్ బోర్డర్ ‘ఆంథోనీ ఫ్రాంక్ హాక్’ ఇటీవలే ఎంపికైన విషయం తెలిసిందే. బర్డ్‌మ్యాన్‌గా పేరుగాంచిన అతడు తన స్కేట్ బోర్డింగ్‌తో ప్రపంచ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే అతని రక్తంతో మిక్స్ చేసి పెయింట్ చేసిన స్కేట్‌బోర్డ్స్ విక్రయిస్తున్నట్లు లిక్విడ్ డెత్ తాజాగా ప్రకటించింది. లెజెండరీ ప్రో స్కేట్ బోర్డర్ టోనీ హాక్.. లిక్విడ్ డెత్ రూపొందిస్తున్న లిమిటెడ్-ఎడిషన్ […]

Update: 2021-08-27 02:39 GMT

దిశ, ఫీచర్స్ : క్యాన్డ్ వాటర్ కంపెనీ ‘లిక్విడ్ డెత్‌’ బ్రాండ్ అంబాసిడర్‌‌గా ఫేమస్ అమెరికన్, ప్రొఫెషనల్ స్కేట్ బోర్డర్ ‘ఆంథోనీ ఫ్రాంక్ హాక్’ ఇటీవలే ఎంపికైన విషయం తెలిసిందే. బర్డ్‌మ్యాన్‌గా పేరుగాంచిన అతడు తన స్కేట్ బోర్డింగ్‌తో ప్రపంచ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే అతని రక్తంతో మిక్స్ చేసి పెయింట్ చేసిన స్కేట్‌బోర్డ్స్ విక్రయిస్తున్నట్లు లిక్విడ్ డెత్ తాజాగా ప్రకటించింది.

లెజెండరీ ప్రో స్కేట్ బోర్డర్ టోనీ హాక్.. లిక్విడ్ డెత్ రూపొందిస్తున్న లిమిటెడ్-ఎడిషన్ స్కేట్‌బోర్డ్ కోసం రెండు వయొల్స్ రక్తం ఇస్తున్నట్లు ఓ వీడియోలో తెలిపాడు. హాక్ రక్తాన్ని స్టెరిలైజ్ చేసిన తర్వాత స్కేట్‌బోర్డులపై గ్రాఫిక్స్ కోసం ఉపయోగించే రెడ్ పెయింట్‌లో మేకర్స్ కలపనున్నారు. హాక్ రక్తాన్ని పెయింట్‌తో ఎలా మిళితం చేశారో కంపెనీ వీడియోలో చూపించింది. వీటి ధర $ 500 కాగా అమ్మకానికి పెట్టిన 20 నిమిషాల్లో అన్నీ బోర్డ్స్ అమ్ముడపోవడం విశేషం.

‘ఇంతవరకు ఇలాంటి ఆలోచన ఎవ్వరూ చేయలేదు. ఐడియా నచ్చడంతో మేం ముందుకు వెళ్లాం. ఎన్నో స్కేట్ ర్యాంప్‌లపై హాక్ గాయాలపాలయ్యాడు. రక్తం కార్చాడు. అతడి రక్తాన్ని ఉపయోగించి పెయింట్ చేయడం వల్ల చాలామందిలో స్ఫూర్తిని నింపుతుందని మేం ఆశిస్తున్నాం. కేవలం 100 స్కేట్ బోర్డ్స్ మాత్రమే తయారుచేస్తున్నాం. లిమిటెడ్ ఎడిషన్‌గా వస్తున్న వీటికి ‘హక్ బ్లడ్ డెక్’ అని పేరు పెట్టాం. స్కేట్ బోర్డ్స్ అమ్మకం ద్వారా వచ్చే లాభాల్లో కొంత భాగం ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు హాక్ సంస్థ ‘ది స్కేట్‌పార్క్ ప్రాజెక్ట్’కు అందిస్తాం. ఇది వెనుకబడిన వర్గాలకు స్కేట్‌పార్క్‌లను నిర్మించడంలో సహాయపడుతుంది’ – ఆండీ పియర్సన్, లిక్విడ్ డెత్, క్రియేటివ్ వైస్ ప్రెసిడెంట్

అయితే ఇలా బ్లడ్ ఇన్‌ఫ్యూజ్ చేసిన వస్తువులు అమ్మడం కొత్తేం కాదు. మార్చిలో ర్యాపర్ లిల్ నాస్ ఎక్స్ తన ‘సైతాన్ షూస్’ విడుదల చేయగా, అందులో రక్తపు చుక్కల్ని మిలితం చేశారు. తన మ్యూజిక్ వీడియో ‘మోంటెరో’ విడుదలకు ముందు MSCHF అనే కంపెనీ సహకారంతో రక్తం చుక్కతో నింపిన లిమిటెడ్-ఎడిషన్ స్నీకర్లను విడుదల చేస్తున్నట్లు లిల్ నాస్ ప్రకటించడంతో అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా.. ఒకే నిమిషంలో ఆ బూట్లు అమ్ముడుపోయి రికార్డ్ సృష్టించాయి.

Tags:    

Similar News