PhonePe: ఫోన్ పేలో ఇంటర్నేషనల్ యూపీఐ సేవలను యాక్టివేట్ చేసుకోవడం ఎలా..!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఇటీవలే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) సేవలను ఇతర దేశాలకు కూడా విస్తరించిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఇటీవలే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) సేవలను ఇతర దేశాలకు కూడా విస్తరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీలంక, మారిషస్, నేపాల్, యూఏఈ, ఫ్రాన్స్, ఒమన్, యూకే లాంటి తదితర దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో విదేశాల్లో కూడా ఫోన్ పే(PhonePe) వంటి యాప్‌లతో యూపీఐ ద్వారా అంతర్జాతీయ లావాదేవీలు(International Transactions) చేసుకోవచ్చు.
ఫోన్ పేలో అంతర్జాతీయ యూపీఐ యాక్టివేట్ ఎలా చేయాలి..?
కాగా ఫోన్ పేలో అంతర్జాతీయ యూపీఐని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే యూజర్లు ముందుగా యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్(Profile) పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ పై క్లిక్ చేసి అంతర్జాతీయ యూపీఐ ట్రాన్సక్షన్స్ కోసం యూజ్ చేయాలనుకునే బ్యాంక్ అకౌంట్(Bank Account) పక్కన ఉన్న యాక్టివేట్ పైన క్లిక్ చేయాలి. చివరిగా..యాక్టివేషన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి యూపీఐ పిన్(PIN) ఎంటర్ చేయాలి. ఆ తరువాత మన బ్యాంక్ అకౌంట్ ఇంటర్నేషనల్ యూపీఐతో లింక్ అప్ అవుతుంది. ఈ ఫీచర్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఈజీగా ఇంటర్నేషనల్ యూపీఐ ట్రాన్సక్షన్స్ చేయవచ్చు.