Stock Market: కొనుగోళ్ల జోరు.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..!
దేశీయ ఈక్విటీ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈ వారాన్ని లాభాలతో మొదలెట్టాయి.
దిశ,వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈ వారాన్ని లాభాలతో మొదలెట్టాయి. గత వారం భారీ నష్టాలను చవిచూసిన మన దలాల్ స్ట్రీట్ నేడు గ్లోబల్ మార్కెట్ల(Global Market) నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడంతో పుంజుకుంది. ముఖ్యంగా డాలర్ వాల్యూ తగ్గడం, మంచి షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండంతో ఇన్వెస్టర్లు(Investors) కొనుగోళ్లు చేపట్టారు. దీంతో ఈ రోజు(సోమవారం) మన సూచీలు లాభాలతో స్టార్ట్ అయ్యాయి. మదుపర్ల సంపదగా భావించే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్(BSE)లో సెన్సెక్స్(Sensex) 78,682(+637) పాయింట్లు వద్ద .. నిఫ్టీ(Nifty) 23,773(+194) వద్ద ట్రేడవుతున్నాయి. ఇక అమెరికన్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.03 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో టాటా స్టీల్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, ఎల్&టీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. స్టేట్ బ్యాంక్ ఇండియా, అపోలో హాస్పిటల్స్, ఫార్మా సెక్టార్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. కాగా ఈ రోజు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) సెన్సెక్స్ 30 సూచీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ షేరు వాల్యూ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE)లో 2.52 శాతం క్షీణించి రూ. 275.20 వద్ద ట్రేడ్ అవుతుంది.