నేడు మరోసారి కరోనా వ్యాక్సిన్ డ్రై రన్
దిశ, వెబ్‌డెస్క్: నేడు దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభం కానుంది. వ్యాక్సిన్ పంపిణీలో తలెత్తే లోటుపాట్లు గుర్తించేందుకు రెండో విడత వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహిస్తున్నారు. దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 736 జిల్లాల్లో డ్రై రన్ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే కోల్డ్ చైన్ విధానాన్ని మరింత పటిష్టం చేసినట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా డ్రైరన్‌లో భాగంగా రాష్ట్రంలో 12 వందల కేంద్రాల్లో డమ్మీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఒక్కొ కేంద్రంలో 25 […]
దిశ, వెబ్‌డెస్క్: నేడు దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభం కానుంది. వ్యాక్సిన్ పంపిణీలో తలెత్తే లోటుపాట్లు గుర్తించేందుకు రెండో విడత వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహిస్తున్నారు. దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 736 జిల్లాల్లో డ్రై రన్ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే కోల్డ్ చైన్ విధానాన్ని మరింత పటిష్టం చేసినట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా డ్రైరన్‌లో భాగంగా రాష్ట్రంలో 12 వందల కేంద్రాల్లో డమ్మీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఒక్కొ కేంద్రంలో 25 మందికి నమూనా ప్రక్రియ నిర్వహించనున్నారు.