Bajrang Punia: రెజ్లర్ బజరంగ్ పూనియాకు బిగ్ షాక్.. నాలుగేళ్ల నిషేధం విధించిన NADA

భారత రెజ్లర్ బజరంగ్ పూనియా (Bajrang Punia)కు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) బిగ్ షాకిచ్చింది.

Update: 2024-11-27 03:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత రెజ్లర్ బజరంగ్ పూనియా (Bajrang Punia)కు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) బిగ్ షాకిచ్చింది. యాంటీ డోపింగ్ కోడ్ (Anti-Doping Code) ఉల్లంఘించిన నేపథ్యంలో ఆయనప ఏకంగా నాలుగేళ్ల నిషేధం విధించింది. నేషనల్ టీం సెలెక్షన్స్‌లో భాగంగా మార్చి 10న డోప్ టెస్ట్ కోసం తన శాంపిల్స్ ఇచ్చేందుకు జజరంగ్ పూనియా (Bajrang Punia) నిరాకరించాడు. ఈ మేరకు అతడిపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) మంగళవారం రాత్రి నాలుగేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏప్రిల్ 23న టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) కాంస్య పతక విజేత పూనియాపై NADA మొదటిసారిగా నిషేధం విధించింది. అనంతరం యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (United World Wrestling) కూడా అతనిని సస్పెండ్ చేసింది. అయితే, తన సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కోరుతూ.. జూన్ 11న బజరంగ్ పూనియా NADA క్రమశిక్షణా డోపింగ్ ప్యానెల్ (ADDP) ఆశ్రయించాడు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై సెప్టెంబర్ 20, అక్టోబర్ 4న విచారణలు నిర్వహించిన క్రమశిక్షణా డోపింగ్ ప్యానెల్ అతడిపై నిషేధం విధించింది.

Tags:    

Similar News