Australia vs India : తగ్గని గాయం...రెండో టెస్టుకూ గిల్ దూరం !

Gill ruled out of second Test due to persistent injury!

Update: 2024-11-27 06:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : అస్ట్రేలియా(Australia), ఇండియా(India) మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ లోని రెండో టెస్టుకు కూడా టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వార్మప్ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్ చేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో అతడు బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుకు ఆడలేకపోయాడు. వేలికి అయిన గాయం ఇంకా తగ్గలేదని.. దీంతో అతడు ప్రైమ్‌మినిస్టర్స్ XI జట్టుతో జరిగే రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో ఆడబోడని సమాచారం. అలాగే అడిలైడ్‌ వేదికగా డిసెంబర్ 6వ తేదీ నుంచి జరగనున్న పింక్‌ బాల్ టెస్టుకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.

గిల్‌కు కనీసం రెండు నుంచి మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని మెడికల్ టీమ్ సిఫార్సు చేసిందని.. ఆ తర్వాతే అతడి గాయం ఎంత వరకు తగ్గిందో పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రెండో టెస్టు కల్లా కోలుకుంటే ముందుగా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటాడని, ఆ తర్వాతే తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో తొలి టెస్టును ఇండియా గెలుచుకుని ఆధిక్యతలో ఉంది. 

Tags:    

Similar News