ICC Champions Trophy-2025: ఐసీసీ బోర్డ్ మీటింగ్.. ఆ రోజునే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల!

రాబోయే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌ (Pakistan) వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) షెడ్యూల్ విడుదలలో సస్పెన్స్ కొనసాగుతోంది.

Update: 2024-11-27 08:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌ (Pakistan) వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) షెడ్యూల్ విడుదలలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈవెంట్ పూర్తి షెడ్యూల్ ప్రకటించాల్సి ఉండగా.. టీమిండియా (Team India), పాకిస్థాన్ వెళ్లేందుకు నో చెప్పడంతో అసలు టోర్నీ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2008 ఉగ్రవాదులు ముంబై‌పై ఎటాక్ (Mumbai Attack) చేసిన తరువాత భారత జట్టు ఇంత వరకు పాకిస్థాన్‌లో పర్యటించ లేదు. ఈ క్రమంలోనే బీసీసీఐ (BCCI), ఐసీసీ (ICC)కి కీలక ప్రతిపాదన చేసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌ (Hybrid Model)లో నిర్వహించాలని లేఖ రాసింది. భారత్ (India) ఆడే మ్యాచ్‌లను పాకిస్థాన్‌ (Pakistan)లో కాకుండా వేరే దేశంలో నిర్వహించాలని కోరింది. అయితే, పీసీబీ (PCB) మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బోర్డు నవంబర్ 29న సమావేశం కానుంది. ఆ సమావేశంలోనే ఛాపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ విడుదలపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా టోర్నీని హైబ్రిడ్ మోడల్ కండక్ట్ చేయాలా వద్దా అన్న విషయంపై కూడా క్లారిటీ రానుంది.  

Tags:    

Similar News