Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. బిల్లు ఆమోదించిన ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎంత ఉంటుందో తెలిసిందే. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే విలవిల్లాడిపోతున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియా కారణంగా చేయకూడని పనులు చేస్తున్నారు.
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎంత ఉంటుందో తెలిసిందే. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే విలవిల్లాడిపోతున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియా కారణంగా చేయకూడని పనులు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాలో ప్రవేశం లేదని (Social Media Ban on Children) ఓ చట్టం తీసుకొచ్చింది. అయితే ఇది మన దేశంలో కాదు. ఆస్ట్రేలియాలో. 16 సంవత్సరాలలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఓ చట్టాన్ని తీసుకొచ్చేందుకు బిల్లును రూపొందించింది. ఆ బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలుపగా.. సెనెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. అదికూడా పూర్తయితే.. బిల్లు చట్టరూపం దాలుస్తుంది.
బుధవారం జరిగిన ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టగా.. 102 ఓట్లు వచ్చాయి. 13 మంది మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించారు. మరో వారంరోజుల్లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. వెంటనే ఆదేశాలు జారీ అవుతాయి. తల్లిదండ్రుల నుంచి వస్తోన్న ఫిర్యాదుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్బనీస్ వెల్లడించారు.