IT Raids: ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్.. ఎందుకంటే?
మధ్యప్రదేశ్ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే హర్వంశ్ సింగ్ రాథోడ్(former BJP MLA Harvansh Singh Rathore) ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులు(IT Raids) షాక్ అయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే హర్వంశ్ సింగ్ రాథోడ్(former BJP MLA Harvansh Singh Rathore) ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులు(IT Raids) షాక్ అయ్యారు. ఇంట్లోని నీటి తొట్టెలో మొసళ్లను(found three crocodiles) చూసి ఐటీ అధికారులు కంగు తిన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నివాసంలో బంగారం, నగదు, బినామీ కార్లతో పాటు మూడు మొసళ్లను గుర్తించారు. అయితే, పన్ను ఎగవేత ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే హర్వంశ్ సింగ్ రాథోడ్, మాజీ కౌన్సిలర్ రాజేష్ కేశర్వానీ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే, రాథోడ్ నివాసంలోని చిన్న పాండ్ లో మూడు మొసళ్లను అధికారులు గుర్తించారు. దీంతో, అటవీశాఖ అధికారులు అప్రమత్తయ్యారు. చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు
రూ. కోట్ల ఎగవేత..
ఇకపోతే, ఈ ఇద్దరూ రూ.155 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.3 కోట్లు స్వాధీనం చేసుకోగా.. దీని విలువ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఇకపోతే, రాథోడ్ తో కేశర్వానీ బీడీ వ్యాపారం నడిపినట్లు అధికారులు వెల్లడించారు. కేశర్వానీ ఒక్కరే రూ.140 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆయన నిర్మాణ వ్యాపారంలోనూ ఉన్నారని తెలిపాయి. కేశర్వానీ నివాసంలో బినామీ పేర్ల మీద దిగుమతి చేసుకున్న కార్లను అధికారులు వెల్లడించారు. ఐటీ అధికారులు రవాణా శాఖ నుండి కార్లకు సంబంధించిన సమాచారాన్ని కోరారు. ఈ కార్లను ఎలా పొందారో అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. రాథోడ్ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తండ్రి హర్నామ్ సింగ్ రాథోడ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.