Artificial Intelligence: దొంగను పట్టించిన ఏఐ.. ఎలాగంటే?

కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/Artificial Intelligence) తాజాగా ఓ దొంగను పోలీసులకు పట్టించింది. ఉత్తర ఢిల్లీ(North Delhi)లో ముసుగు ధరించిన ఓ దొంగ మహిళ నుంచి మొబైల్ ఫోన్ దొంగిలించి పారిపోయాడు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే మాస్క్ ధరించి పరుగెడుతున్న దొంగ కనిపించాడు.

Update: 2024-11-26 19:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/Artificial Intelligence) తాజాగా ఓ దొంగను పోలీసులకు పట్టించింది. ఉత్తర ఢిల్లీ(North Delhi)లో ముసుగు ధరించిన ఓ దొంగ మహిళ నుంచి మొబైల్ ఫోన్ దొంగిలించి పారిపోయాడు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే మాస్క్ ధరించి పరుగెడుతున్న దొంగ కనిపించాడు. కానీ, ముసుగు ధరించడం వల్ల దొంగను గుర్తించడం కష్టమైంది. అప్పుడే పోలీసులు ఏఐ(AI) ఉపయోగించి సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన చోరుడి ముసుగు తొలగించే(Unmask) ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారికి మసకగా ఆ దొంగ ముఖం ఆనవాల్లు కనిపించాయి. ఈ ఆనవాళ్లతో దొంగను గుర్తించి పట్టుకున్నారు. 23 ఏళ్ల అఫ్నాన్ అలీ నుంచి మొబైల్ స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు.

Tags:    

Similar News