ఎమ్మెల్సీ కవితను కలిసిన టీఎన్జీవో నేతలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అధికారిక పర్యటనలో భాగంగా నిజామాబాద్ నగరానికి విచ్చేసిన శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను ఎంప్లాయిస్ జేఎసీ చైర్మన్ అలుక కిషన్ మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభంకు వచ్చిన సందర్భంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టిన కొత్త జోనల్ వ్యవస్థను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. మొదటగా ఉద్యోగుల క్యాడర్ స్ట్రేంథ్ ఫైనలైజ్ చేసి, దాని ప్రాతిపదికన జోనల్ బదిలీలు చేయాలని, జిల్లాల […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అధికారిక పర్యటనలో భాగంగా నిజామాబాద్ నగరానికి విచ్చేసిన శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను ఎంప్లాయిస్ జేఎసీ చైర్మన్ అలుక కిషన్ మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభంకు వచ్చిన సందర్భంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టిన కొత్త జోనల్ వ్యవస్థను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. మొదటగా ఉద్యోగుల క్యాడర్ స్ట్రేంథ్ ఫైనలైజ్ చేసి, దాని ప్రాతిపదికన జోనల్ బదిలీలు చేయాలని, జిల్లాల పునర్విభజనలో కామారెడ్డి జిల్లా కు “ఆర్డర్ టు సర్వ్”పై వెళ్ళిన ఉద్యోగులను నిజామాబాద్ జిల్లాకు త్వరితగతిన బదిలీ చేయాలని ఎమ్మెల్సీ కవితను కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన కవిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంఘం అమృత్ కుమార్, సలహాదారులు ఆకుల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్, జాకీర్ హుస్సేన్, సంజీవయ్య, శ్రీనివాస్, సత్యం, నీటిపారుదల శాఖ జిల్లా అధ్యక్షులు పందిరి స్వామి తదితరులు ఉన్నారు.