BRSV: 40 ఏళ్లు దాటినా విద్యార్థులేనా..? పార్టీపై బీఆర్ఎస్వీ నేతల అసంతృప్తి
బీఆర్ఎస్ నాయకత్వం తీరు పట్ల ఆ పార్టీ విద్యార్థి సంఘమైన బీఆర్ఎస్వీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నాయకత్వం తీరు పట్ల ఆ పార్టీ విద్యార్థి సంఘమైన బీఆర్ఎస్వీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 40 ఏళ్లు దాటిన వారు కూడా ఇంకా విద్యార్థులేనా అని ప్రశ్నించినట్లు సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని, విపక్షంలోకి వచ్చినా పార్టీ కార్యక్రమాల్లో తమను భాగస్వామ్యం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థుల మరణాలపై పార్టీపరంగా తాము స్పందిస్తున్నా.. విద్యార్థి సంఘంగా బీఆర్ఎస్వీ ఎందుకు నిరసనలు తెలపడం లేదని పార్టీ నాయకత్వం వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
నందినగర్‌లో కీలక సమావేశం
బీఆర్ఎస్వీ నేతలను మంగళవారం పార్టీ నాయకత్వం పిలిచి మాట్లాడింది. బుధవారం బీఆర్ఎస్వీ ముఖ్య నాయకులతో నందినగర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కీలక నేతలు, పలువురు మాజీ మంత్రులు హాజరయ్యారు. అంతర్గతంగా జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకత్వంపై విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యేలకే పెత్తనమిచ్చారని, దీంతో తాము ఎదగలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. విపక్షంలో వచ్చాకైనా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తారనుకుంటే అది కూడా చేయడంలేదని వాపోయినట్లు సమాచారం. విద్యార్థి నాయకుల పట్ల చిన్నచూపు, వివక్ష కొనసాగుతున్నదని చెప్పినట్లు తెలిసింది. ఏ పార్టీకైనా అధికారంలోకి రావడానికి విద్యార్థి సంఘం కీలకమని, అలాంటిది తమకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదని సమావేశంలో చెప్పినట్లు సమాచారం.
40 ఏళ్లు పైబడిన వారు కూడా విద్యార్థి నాయకులుగా ఉండడం తో విద్యార్థులకు, నాయకత్వానికి మధ్య గ్యాప్ వస్తున్నదని చెప్పినట్లు తెలిసింది. తక్కువ వయసు ఉన్న విద్యార్థి సంఘం నాయకుడిగా నియమించాలని సూచించినట్లు సమాచారం. బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియాలోనూ విద్యార్థి విభాగం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్టులు చేయడంపై విద్యార్థి సంఘం ముఖ్యులు, పార్టీ నాయకుల మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు తెలిసింది. మనకు వ్యతిరేకంగా మనమే వ్యతిరేక పోస్టులు పెడితే.. అధికార పార్టీ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిస్థితికి పార్టీ కీలక నాయకత్వమే కారణమని, ఆ తప్పును తమపై నెట్టి వేయడం సరికాదని చెప్పినట్లు సమాచారం. ఇప్పుడున్న నాయకత్వాన్ని మార్చాలని నాయకత్వం ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్లుగా ‘ఎక్స్’లో పోస్టు ద్వారా అర్థమైందని బీఆర్ఎస్వీ నాయకులు చెబుతున్నారు.
త్వరలో నూతన కమిటీ
విద్యార్థి సంఘ నాయకుల సమస్యలను విన్న కీలక నేత, విద్యార్థి సంఘం పరిస్థితికి తాము కూడా భాధ్యులమేనని అంగీకరించినట్లు సమాచారం. విద్యార్థి విభాగం అనేక కారణాలతో నిర్వీర్యం అయిందని పరోక్షంగా చెప్పినట్లు తెలిసింది. ఇక నుంచి విద్యార్థి సంఘాన్ని కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తామని, ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం వంద మంది విద్యార్థులను కరుడుకట్టిన వారీగా తయారు చేయాలని సూచించినట్లు సమాచారం. వచ్చే ఏప్రిల్ 27న పార్టీ ప్లీనరీ ఉందని, ఆ లోగా అన్ని కమిటీలు