నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ జెట్లు
న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ఈ రోజు మనదేశానికి రానున్నాయి. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గుజరాత్‌లో ల్యాండ్ కానున్నాయి. ఈ మూడు రాఫెల్ జెట్లు ఫ్రాన్స్ నుంచి నేరుగా ఇండియా చేరనున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎయిర్ బస్ 330 మల్టీ రోల్ ట్రాన్స్‌పోర్టర్ ట్యాంకర్ ఈ జెట్లకు ఆకాశంలోనే ఇంధనాన్ని నింపనుంది. హర్యానాలో అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో గోల్డెన్ యారో స్క్వాడ్రన్‌లో మూడు రాఫెల్ జెట్లను చేర్చనున్నారు. […]
న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ఈ రోజు మనదేశానికి రానున్నాయి. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గుజరాత్‌లో ల్యాండ్ కానున్నాయి. ఈ మూడు రాఫెల్ జెట్లు ఫ్రాన్స్ నుంచి నేరుగా ఇండియా చేరనున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎయిర్ బస్ 330 మల్టీ రోల్ ట్రాన్స్‌పోర్టర్ ట్యాంకర్ ఈ జెట్లకు ఆకాశంలోనే ఇంధనాన్ని నింపనుంది.
హర్యానాలో అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో గోల్డెన్ యారో స్క్వాడ్రన్‌లో మూడు రాఫెల్ జెట్లను చేర్చనున్నారు. దీంతో స్క్వాడ్రన్‌లో రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్య 14కు చేరనుంది. ఏప్రిల్ నెలలో మరో తొమ్మిది రాఫెల్ జెట్లు ఇండియాకు వస్తాయి. ఇందులోని ఐదు జెట్లను పశ్చిమ బెంగాల్‌లోని హశిమారా ఎయిర్‌బేస్‌లోకి చేర్చనున్నారు. ఒక స్క్వాడ్రన్‌లో 18 జెట్లు ఉంటాయి.
ఫ్రాన్స్‌లోని డసాల్ట్ ఏవియేషన్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం 36 యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి. తొలి బ్యాచ్‌గా గతేడాది జులై 29న ఐదు రాఫెల్ జెట్లు, రెండో బ్యాచ్‌గా గతేడాది నవంబర్ 3న మూడు జెట్లు, మూడో బ్యాచ్‌గా ఈ ఏడాది జనవరి 27న మరో మూడు రాఫెల్ జెట్లు మనదేశానికి వచ్చాయి.