బయ్యారంలో పట్టపగలే గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్టు
దిశ, బయ్యారం : ఉమ్మడి వరంగల్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలో పట్టపగలే జోరుగా గంజాయి రవాణా జరుగుతోంది. శనివారం ఇల్లందు, మహబూబాబాద్ ప్రధాన రహదారిపై ఎస్‌ఐ జగదీష్ తమ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వారిని పట్టుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి భారీగా గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన వారు భూక్యా రాజేందర్, బోడా దేవేందర్, భూక్యా రాజేందర్‌లుగా […]
దిశ, బయ్యారం : ఉమ్మడి వరంగల్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలో పట్టపగలే జోరుగా గంజాయి రవాణా జరుగుతోంది. శనివారం ఇల్లందు, మహబూబాబాద్ ప్రధాన రహదారిపై ఎస్‌ఐ జగదీష్ తమ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వారిని పట్టుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి భారీగా గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
పట్టుబడిన వారు భూక్యా రాజేందర్, బోడా దేవేందర్, భూక్యా రాజేందర్‌లుగా గుర్తించినట్టు ఎస్‌ఐ తెలిపారు. వీరిని విచారించగా విశాఖకు చెందిన వ్యక్తి నుంచి గంజాయి తెప్పించుకొని వేర్వేరు ప్రాంతాలలో విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో అంగీకరించారు. అదే విధంగా శనివారం సీలేరు నుంచి గంజాయి కొనుగోలు చేసి తరలిస్తుండగా తనిఖీల్లో భాగంగా నిందితులు పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు. గంజాయి మొత్తాన్ని స్వాధీనం చేసుకుని తహశీల్దార్ నాగభవానీ సమక్షంలో పంచనామా నిర్వహించి.. 20 ప్యాకెట్లను కస్టడీలోకి తీసుకున్నామన్నారు. దీని విలువ సుమారు 6 లక్షల యాభై వేలు ఉంటుందని సమాచారం. ఈ మేరకు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది స్వామి, నాగరాజు, విజయ్ వెంకన్న పాల్గొన్నారు.