వైఎస్ వివేకాను హత్య చేసింది వాళ్లే.. పంచుమర్తి అనురాధా
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధా సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య వెనుక ఆయన రక్తసంబంధీకులే ఉన్నారన్నారు. ఈ కేసులో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి కాన్ఫెషన్ స్టేట్మెంట్లో ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. నిర్ధారణ అయిన తర్వాత కూడా వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. వైఎస్ వివేకా హత్యపై విజయసాయిరెడ్డి, వైసీపీ […]
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధా సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య వెనుక ఆయన రక్తసంబంధీకులే ఉన్నారన్నారు. ఈ కేసులో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి కాన్ఫెషన్ స్టేట్మెంట్లో ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. నిర్ధారణ అయిన తర్వాత కూడా వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
వైఎస్ వివేకా హత్యపై విజయసాయిరెడ్డి, వైసీపీ మీడియా, ఆ పార్టీ నేతలు మొదటి నుంచి తప్పుడు ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్యకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.