పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 9 మంది అరెస్టు

నరసరావుపేట రూరల్ పోలీసులు నేడు(గురువారం) పేకాట స్థావరంపై దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు.

Update: 2024-11-28 14:56 GMT

దిశ, నరసరావుపేట: నరసరావుపేట రూరల్ పోలీసులు నేడు(గురువారం) పేకాట స్థావరంపై దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంగుంట్ల గ్రామంలోని శ్రీ లక్ష్మి విజయ పార్కింగ్ రూంలో పేకాట ఆడుతున్న వారిని రూరల్ ఎస్ ఐ కిషోర్, తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.72,100/ నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఐ కిషోర్ మాట్లాడుతూ నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎస్పీ ఆదేశాల మేరకు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Similar News