లింగ సమానత్వం కోసం ఇంకా యుద్ధం చేస్తున్నాం- సాగరిక ఘోష్

దిశ, శేరిలింగంపల్లి: ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని వారికి సరైన ప్రోత్సాహం లభిస్తే విశ్వ యవనికపై తనదైన ముద్ర వేస్తారని, ఇప్పటికే ఆ దిశగా ఎంతోమంది అడుగులు వేసి ప్రత్యేక గుర్తింపు సాధించారని అన్నారు ​ప్రముఖ జర్నలిస్ట్, రచయిత, కాలమిస్ట్ సాగరిక ఘోష్. గురువారం మాదాపూర్‌‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమా చిగురుపాటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సాగరిక ఘోష్ మహిళల […]

Update: 2021-09-02 11:26 GMT

దిశ, శేరిలింగంపల్లి: ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని వారికి సరైన ప్రోత్సాహం లభిస్తే విశ్వ యవనికపై తనదైన ముద్ర వేస్తారని, ఇప్పటికే ఆ దిశగా ఎంతోమంది అడుగులు వేసి ప్రత్యేక గుర్తింపు సాధించారని అన్నారు ​ప్రముఖ జర్నలిస్ట్, రచయిత, కాలమిస్ట్ సాగరిక ఘోష్. గురువారం మాదాపూర్‌‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమా చిగురుపాటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సాగరిక ఘోష్
మహిళల జీవితం, స్వేచ్ఛపై ప్రసంగించారు.

తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణంలో నేర్చుకున్న కొన్ని అనుభవాలను పంచుకున్నారు. ఎప్పుడూ స్వేచ్ఛగా జీవించాలని, ప్రతీక్షణం ఆనందంగా గడపాలని అన్నారు. చదువుకోడానికి అమెరికా వెళ్లాక భారతదేశ గొప్పతనం గురించి తెలుసుకున్నానని, భారతీయ మహిళా అంటే ఏంటో అప్పుడే అవగతమైందన్నారు. ప్రతీ రంగంలోనూ రాణిస్తున్న మహిళలు నేటికి వివక్షకు గురవుతున్నారని, సమానత్వం కోసం ఇంకా యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. నేటికి మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, మహిళలు బాధపడుతూనే ఉన్నారని, మన సామాజిక మనస్తత్వాన్ని మనమే మార్చుకోవాలని, మహిళల గురించి ప్రజలు ఆలోచించే విధానాన్ని మనం సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

మనకు లింగ సమాన సమాజం కావాలని, ప్రజాస్వామ్యానికి మహిళల సాధికారత ముఖ్యం అని ఆమె అన్నారు. ముఖ్యంగా రాజకీయాలు, జర్నలిజంలో ఇంకా వివక్ష ఉందన్నారు. జర్నలిస్ట్‌గా తాను ఎన్నో నేర్చుకున్నానని, కొన్నిసార్లు చెవిటి వారిగా ప్రవర్తించడం మేలే చేస్తోందని, అత్తల విషయంలో ఇది ఎంతో సహకరిస్తుందని సాగరిక ఘోష్ సరదాగా వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై అనేక పుస్తకాలు వచ్చినా తన పుస్తకం భిన్నంగా ఉంటుందని సాగరిక వెల్లడించారు.

ఎఫ్ ఎల్ ఓ గూర్చి వివరించిన ఉమా చిరుగురుపాటి వైట్ కాలర్ వ్యక్తులతో పాటు అట్టడుగు స్థాయి వ్యక్తుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని, గ్రామీణ బాలికల దూర విద్యకు ఎఫ్ ఎల్ ఓ మద్దతు ఇస్తోందన్నారు. హైదరాబాద్ పోలీసులతో కలిసి ఇప్పటి వరకు 974 మహిళలకు ఉద్యోగాలు కల్పించామన్నారు. ఈకార్యక్రమంలో ఫిక్కీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News