డిగ్రీ ప్రశ్నపత్రాల లీకేజీ విచారణ వేగం.. ఆ కాలేజీ ఉపాధ్యాయుల గుండెల్లో గుబులు

దిశ, కరీంనగర్ సిటీ: డిగ్రీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై చేపట్టిన విచారణ వేగం పుంజుకుంది. నగరంలోని రెండో పట్టణ పోలీసులు రెండు రోజులుగా, పలు కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. ఇప్పటికే ఆరోపణలెదుర్కొంటున్న విద్యార్థుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, ఆయా ఫోన్లలోని డేటా బ్యాకప్ ద్వారా రికవరీ చెందినట్లు తెలుస్తుండగా, తాజాగా, యూనివర్సిటీలో పరీక్షల నియంత్రణ విభాగం అధికారులతో పాటు, ఇతర విభాగాల హెచ్ఓడీ లను కూడా ప్రశ్నించినట్లు సమాచారం. యూనివర్సిటీ అధికారులకు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు […]

Update: 2021-08-26 02:49 GMT

దిశ, కరీంనగర్ సిటీ: డిగ్రీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై చేపట్టిన విచారణ వేగం పుంజుకుంది. నగరంలోని రెండో పట్టణ పోలీసులు రెండు రోజులుగా, పలు కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. ఇప్పటికే ఆరోపణలెదుర్కొంటున్న విద్యార్థుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, ఆయా ఫోన్లలోని డేటా బ్యాకప్ ద్వారా రికవరీ చెందినట్లు తెలుస్తుండగా, తాజాగా, యూనివర్సిటీలో పరీక్షల నియంత్రణ విభాగం అధికారులతో పాటు, ఇతర విభాగాల హెచ్ఓడీ లను కూడా ప్రశ్నించినట్లు సమాచారం. యూనివర్సిటీ అధికారులకు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధ బాంధవ్యాలపై కూడా ఆరా తీసి, సమాచారం సేకరించినట్లు భోగట్టా. లీకేజీ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సీరియస్ కావటంతో, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్ యూ ఉపకులపతి ప్రో. మల్లేష్ ప్రత్యేకంగా విచారణ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు, లీకేజీకి బాద్యులైన వారిని గుర్తించాలంటూ, పోలీస్ స్టేషన్లో కూడా సంబంధిత అధికారులతో ఫిర్యాదు చేయించారు.

దీంతో, కమిటీ అంతర్గత విచారణ మొదలు పెట్టగా, పోలీసులు బహిరంగంగా కొనసాగిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులతో పాటు, వారి మిత్రులను కూడా పలు దఫాలుగా విచారించారు. ప్రశ్నపత్రం లీకేజీ అయిన ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో కూడా, విద్యార్థులను తీసుకెళ్లి విచారణ జరిపినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. లీకేజీ వ్యవహారంలో పట్టుబడ్డ విద్యార్థులంతా, నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందినవారు కాగా, ఆ కళాశాల యాజమాన్యంలో ఆందోళన మొదలైంది. గతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలు పాల్పడ్డా, విశ్వ విద్యాలయ అధికారులు చూసి చూడనట్లు ఉన్నారు. కానీ, ఈసారి మాత్రం విసీ ప్రత్యేక దృష్టి సారించటం, అన్ని వైపుల నుంచి పకడ్బందీగా విచారణ సాగుతుండటంతో ప్రైవేట్ యాజమాన్యాల్లో గుబులు రేకెత్తుతుంది. విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల నుంచి డేటా బ్యాక్ అప్ కాగానే, ప్రైవేట్ యాజమాన్యాల బండారం బయటపడే అవకాశాలున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో విచారణ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తుండగా, లీకేజీకి బాద్యులైన వారిని అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. కాగా, విచారణను తొక్కిపెట్టేందుకు ఉన్నత స్థాయిలో అధికారపార్టీ నేతలతో కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసు అధికారుల వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతుంది.

Tags:    

Similar News