నిర్మల్ కుదుటపడుతోంది!

దిశ, ఆదిలాబాద్: కరోనా రక్కసి నుంచి నిర్మల్ జిల్లా క్రమంగా కుదుటపడుతోన్నది. రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో ఒకటైన ఈ జిల్లాలో కరోనా భయం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో మాత్రమే నమోదైన కేసులు క్రమంగా పల్లెలకు విస్తరించాయి. దీంతో నిర్మల్ జిల్లా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డా. అతుల్ ఇక్కడికి చేరుకుని సమీక్షించారు. ఆ తర్వాత జిల్లా యంత్రాంగం కరోనా కట్టడికి కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఫలించిన […]

Update: 2020-04-28 01:41 GMT

దిశ, ఆదిలాబాద్: కరోనా రక్కసి నుంచి నిర్మల్ జిల్లా క్రమంగా కుదుటపడుతోన్నది. రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో ఒకటైన ఈ జిల్లాలో కరోనా భయం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో మాత్రమే నమోదైన కేసులు క్రమంగా పల్లెలకు విస్తరించాయి. దీంతో నిర్మల్ జిల్లా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డా. అతుల్ ఇక్కడికి చేరుకుని సమీక్షించారు. ఆ తర్వాత జిల్లా యంత్రాంగం కరోనా కట్టడికి కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.

ఫలించిన కట్టడి…

నిర్మల్ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత పెరగడంతో లాక్ డౌన్ ను జిల్లా యంత్రాంగం కఠినంగా అమలు చేసింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, జిల్లా వైద్యాధికారి డా. వసంతరావుతోపాటు ఇతర అధికారుల ఆధ్వర్యంలో నిరంతరం నిఘా పెంచారు. డా. అవినాష్ నేతృత్వంలో 300 మంది ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపారు. నిర్మల్ పట్టణంలో 12 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడం, వాహనాలను సీజ్ చేయడం వంటి కార్యక్రమాలతోపాటు జన సంచారాన్ని కట్టడి చేశారు.

కొత్త కేసులు నిల్…

నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ బారిన 23 మంది పడ్డారు. వీరిలో ఐదుగురు మినహా మిగతావారు మర్కజ్ లింకు ఉన్నవాళ్లే. అయితే ముగ్గురు మరణించగా, 20 మంది గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే 12 మంది చికిత్స పొందిన తర్వాత పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 8 మంది ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వారంలో వీరంతా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని జిల్లా వైద్యాధికారి తెలిపారు. క్రమంగా సాధారణ వాతావరణం నెలకొంటుండడంతో జనాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లను మొత్తం ఎత్తివేయడం, కొత్త కేసులు నమోదు కాకపోవడంతో ఊపిరి తీసుకుంటున్నారు. అయితే ఇంకా లాక్‌డౌన్ ను కొనసాగిస్తున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల దాకా సడలింపు ఇవ్వాలని నిర్ణయించడంతో గ్రామాల్లో వ్యవసాయ పనులు ఊపందుకుంటున్నాయి.

Tags: Adilabad, Nirmal, Corona cases, gradually decreasing, doctors, police

Tags:    

Similar News