పెద్దపులి కాదు వైల్డ్ డాగ్స్

మండలంలోని ఘన్ పూర్ గ్రామ శివారులోని అటవీ సమీపంలో శనివారం జింకపై అడవి కుక్కలు దాడి చేసి చంపి తిన్నాయి.

Update: 2024-11-23 11:02 GMT

దిశ, బోథ్ : మండలంలోని ఘన్ పూర్ గ్రామ శివారులోని అటవీ సమీపంలో శనివారం జింకపై అడవి కుక్కలు దాడి చేసి చంపి తిన్నాయి. కానీ ఇక్కడి చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని రోజుల క్రితం పులి తిరుగుతుండటంతో జింకను చంపింది కూడా పులే అని ప్రజలు భయపడుతున్నారు. ఈ విషయాన్ని పలువురు సోషల్ మీడియాలో పెట్టడంతో తప్పుడు ప్రచారం చక్కర్లు కొడుతుంది. ఈ విషయమై అటవీ శాఖ అధికారి ప్రణయ్ ను వివరణ కోరగా జింకపై దాడి చేసింది పెద్దపులి కాదని, అడవి కుక్కలని స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికావద్దని కోరారు. 


Similar News